ఇబ్రహీంపట్నం జూలై తేదీ 3 ప్రజా పాలన ప్రతినిధి.

Published: Monday July 04, 2022

ప్రైవేటు పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలే ముద్దు*

జూలై 30న టెన్త్ ఫలితాలు ఉదయం 11:30 నిమిషాలకు జూబ్లీహిల్స్ లోని ఎంసిహెచ్ఆర్డి ఇన్స్టిట్యూడ్లో పదవ తరగతి ఫలితాలు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సంవత్సరంలో ఐదు లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీలోని కొంగరకలాన్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న గంగాపురం గాయత్రికి10/10 రావడం జరిగింది. విషయం తెలుసుకున్న ఆదిభట్ల మున్సిపాలిటీ టిఆర్ఎస్ ఉపాధ్యక్షులు పాతూరి రాము గౌడ్ విద్యార్థిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా పాతూరు రాము మాట్లాడుతూ, మెరుగైన ఫలితాలు సాధించాలంటే ప్రభుత్వ పాఠశాలలోనే సాధ్యమవుతుందని విద్యార్థులు ఏకాగ్రతతో చదివి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ చదువు ఒక్కటే పేదరికాన్ని దూరం చేస్తుందని, సమాజంలో చదువుకు ఉన్న మర్యాద ఏ ఒక్కరికి లేదని ఆనాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన విషయాలు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు గుర్తు చేసుకోవాలన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు రమేష్ లావణ్య మాట్లాడుతూ, ఎంతోమంది తల్లిదండ్రులు తమ పిల్లలను డబ్బులు పోసి ప్రైవేటు స్కూళ్లలో విద్యా బోధనకు పంపిస్తే, తెలిసి తెలియని చదువులతో వచ్చిరాని భాషలో వారు చెప్తుంటే, అనుభవం ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకు పేరు లేకుండా పోయిందని, కష్టంతో కాదు ఇష్టంతో చదివితే ఏదైనా సాధ్యమని నిరూపించి మా పేరు నిలబెట్టినందుకు సంతోషంగా ఉందని ఆనందభాష్పాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడపిల్లను చదివించవద్దు అంటారు కొందరు అలాంటి వారికి ఒక నిదర్శనంగా మా కూతురు ఉన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నామని తెలిపారు.