అనుమతులు లేని లేఅవుట్ లపై చర్యలు తీసుకోవాలి ** డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ **

Published: Tuesday December 27, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 26 (ప్రజాపాలన, ప్రతినిధి) :ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి మండలంలో కొంతమంది వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా  లేఅవుట్లు తీసుకోని భూ విక్రయాలు చేస్తున్నరని, వారిపై చర్యలు తీసుకోవాలని  డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో కార్తీక్ మాట్లాడుతూ వాంకిడి మండలంలో కొన్ని సంవత్సరాల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది వ్యక్తులు అక్రమ లేఅవుట్లు చేస్తూ భూ విక్రయాలు చేస్తూ దందా కొనసాగిస్తున్నారని అన్నారు.  లేఅవుట్లు తీసే ముందు రెవెన్యూ శాఖ నుండి అనుమతులు లేకుండా  మండల కేంద్రంలో అక్కడక్కడ  లేఆవుట్లు తీసుకొని భూ విక్రయాలు చేస్తూ భవనాలు నిర్మిస్తున్నారని,దానితో వర్షాలు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో వర్షపు నీరు నిండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు.లేఅవుట్లకు అనుమతులు లేకనే యాజమాన్యులు తమకి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, వీరికి రెవెన్యూ అధికారులు కూడా తోడు కావడంతో అడ్డు అదుపు లేకుండా లేఅవుట్లు తీసుకోని  దందా కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా లేఅవుట్లు అన్ని పర్మిషన్ లతో కూడుకుని ఉండాలని నిర్ధారించిందని, వాటిని పక్కనబెట్టి అధికారుల అండదండలతో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఆరోపించారు. మండలంలో ఉన్నతాధికారులు లే అవుట్ ల పై చర్యలు తీసుకోవలని,తక్షణమే వాటిపై విచారణ జరిపించి వెంచర్లు వేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,లేనిపక్షంలో మండలంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన  నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల నాయకులు నాగోసే సోమయ్య ఆదే శ్రీకాంత్,లు పాల్గొన్నారు*.