27న జిల్లా కబడ్డీ క్రీడాకారుల ఎంపిక

Published: Friday February 25, 2022
జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవన్ నాయక్
వికారాబాద్ బ్యూరో 24 ఫిబ్రవరి ప్రజాపాలన : తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చ్ నెలలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడల్లో వికారాబాద్ జిల్లా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, బాలబాలికలు, మహిళలు, పురుషుల కబడ్డీ క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవన్ నాయక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురుషులు, మహిళల కబడ్డీ జట్ల ఎంపికలో పాల్గొనేవారు పురుషులు 85 కిలోలు, మహిళలు 75 కిలోలలోపు బరువు కలిగి ఉండాలని సూచించారు. జూనియర్ బాలురు 70 కిలోలు, బాలికలు 65 కిలోలలోపు బరువు కలిగి ఉండాలని పేర్కొన్నారు. 2002 తరువాత జన్మించిన వారై ఉండాలని స్పష్టం చేశారు. సబ్ జూనియర్ బాలురు, బాలికలు 55 కిలోల లోపు బరువు ఉండాలని వివరించారు. ఎస్ఎస్ సి మెమో, బోనఫైడ్, ఆధార్ కార్డు సర్టిఫికెట్ లను తీసుకుని 27 ఫిబ్రవరి 2022న ఉదయం 11 గంటలకు బ్లాక్ గ్రౌండ్ కు హాజరు కావాలని సూచించారు.  ఇతర వివరాలకు 9866 273566, 8328 167447 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని కోరారు.