*న్యాక్ అక్రిడేషన్ అసైన్మెంట్ లో విద్యార్థులు భాగస్వాములు కావాలి**

Published: Saturday January 28, 2023

-బి ఆర్ ఏ ఓ యు విద్యార్థులు
న్యాక్  మెయిల్ ను చెక్ చేసుకోవాలి.


-న్యాక్ ప్రశ్నవలికీ  మెయిల్ ద్వారా పరీక్ష  రాయాలి.

-బి ఆర్ ఏ ఓ యు కోఆర్డినేటర్ షేక్ మహబూబ్.

చేవెళ్ల జనవరి 27 (ప్రజాపాలన):-

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం న్యాక్ అక్రిడేషన్ సాధించడంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని యూనివర్సిటీ అభ్యాసక సహాయ కేంద్రం కోఆర్డినేటర్ షేక్ మహబూబ్ కోరారు. విద్యార్థులకు న్యాక్ నుంచి మెయిల్ వస్తుందని ఆ మెయిల్ తక్షణం స్పందించాలని సూచించారు. 20 ప్రశ్నలతో కూడిన మెయిల్ వస్తుందని విద్యార్థులు కనీసం రెండు రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలని కోరారు. న్యాక్ అక్రిడేషన్ అసైన్మెంట్ లో భాగంగా యూనివర్సిటీ అందించే సేవలపై విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు  న్యాక్ ప్రశ్నావళిని ఈమెయిల్ ద్వారా పంపుతుందని మెయిల్ అందుకున్న విద్యార్థులు ఆ ప్రశ్నలకు తగిన జవాబులు గుర్తించి తిరిగి పంపాలని సూచించారు. ప్రశ్నల కింద ఉన్న సమాధానాల్లో ఒకదానిపై క్లిక్ చేయాలని అన్ని ప్రశ్నలకు సమాధానాల పైన క్లిక్ చేశాక సబ్మిట్ చేయాలని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అనుమానాలు ఉన్న అభ్యాసక సహాయ కేంద్రంలో సంప్రదించాలని కోరారు. న్యాక్ నుంచి విడుదలవారీగా విద్యార్థులకు మెయిల్స్ వస్తాయని క్రమం తప్పకుండా మెయిల్స్ చూస్తూ ఉండాలని తెలిపారు.