నూతన దంపతులను ఆశీర్వదించిన తుమ్మలపల్లి రమేష్

Published: Tuesday June 28, 2022
తల్లాడ, జూన్ 27 (ప్రజాపాలన న్యూస్):
 
 తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన గొడ్ల  వెంకటయ్య(ఎర్ర), వెంకటమ్మ దంపతులకు కుమారుడు నరేష్ శిల్పాల వివాహం సోమవారం గ్రామంలో జరిగింది. ఈ వివాహా వేడుక కార్యక్రమానికి టిఆర్ఎస్ పార్టీ తల్లాడ మండల నాయకులు తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు పిల్లాపాపలతో ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డాక్టర్ సోంపోగు బాపూజీ,  గొడ్ల వెంకటి, ఇస్సాకు,  బాబు, జనార్దన్ ఉన్నారు.