జక్కంపూడి ఆధ్వర్యంలో గడియారాలు పంపిణీ..

Published: Monday August 08, 2022
తల్లాడ, ఆగస్టు 7 (ప్రజాపాలన న్యూస్) 

తల్లాడ మండలంలోని బిల్లుపాడు గ్రామంలో గ్రామ సర్పంచ్ జక్కంపూడి ప్రేమలత,  ఉపసర్పంచ్ సావినేని రాణీ, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గోడ గడియారాలను ఆదివారం పంపిణీ చేశారు. గ్రామంలోని ముస్లిం, ఎస్సీ కాలనీల్లో వీటిని పంపిణీ చేశారు. ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహవేడుక పత్రిక, రిసెప్షన్ ఆగస్టు 17న ఖమ్మం లోని ఎస్ ఆర్ గార్డెన్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులందరూ హాజరు కావాలని కార్డుతో పాటు గిఫ్టులను అందించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు బేగ్ నాగులుమీరా, సైదా, అక్బర్, సలీం, యలమర్తి  వెంకటమ్మ,  చిట్టెమ్మ, సురేష్, రజిని, ప్రభాకర్, శిరీష, తదితరులు పాల్గొన్నారు.*