జిల్లాలో ఖాళీగా స్థానిక సంస్థలకు ఎన్నికలు

Published: Wednesday April 13, 2022
జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్
వికారాబాద్ బ్యూరో 12 ఏప్రిల్ ప్రజాపాలన : జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా అర్హులైన వారు ఓటరు నమోదుకై దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జిల్లాలో వివిధ కారణాల వల్ల ఖాళీలు ఏర్పడ్డ ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహించనున్నట్లు అడిషనల్ కలెక్టర్ తెలిపారు. నూతనంగా ఓటరు నమోదు చేసుకోవడమే కాకుండా ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా సరిచేసుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో మరణించిన వారి పేర్లు ఉన్నట్లయితే తొలగించేందుకు సూచించ వలసిందిగా తెలిపారు. ఓటరు జాబితాలను ఏప్రిల్ 13న ఎంపీడీవో కార్యాలయాలలో ప్రదర్శించడం జరుగుతుందని ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే సంబంధిత అధికారిని సంప్రదించి సూచించ వలసిందిగా తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన,  ఓటమి చెందిన అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికలకు సంబంధించిన ఖర్చుల వివరాలను సమర్పించాలని  సూచించారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు ఖర్చుల వివరాలు సమర్పించని ఎడల వారిని ఎన్నికల కమిషన్ అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది అనే విషయంపై ఎన్నికల్లో పాల్గొనే వారికి అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు. జిల్లాలో 18 మండలాల్లోని 566 గ్రామ పంచాయతీలుండగా 187 గ్రామ పంచాయతీల పరిధిలో ఖాళీలుగా ఏర్పడ్డ 9 ఎంపీటీసీలు, 9 సర్పంచులు, 335 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. బంట్వారం మండలంలో 2 వార్డులు, బషీరాబాద్ మండలం 1 సర్పంచ్, 8 వార్డులు, 1 ఎంపీటీసీ, బొమ్మరసిపేట్ 8 వార్డులు, దారూర్ 69 వార్డులు, 4 ఎంపీటీసీలు, దోమ 9వ వార్డులు, 1 ఎంపిటిసి, దౌలతాబాద్ 1 సర్పంచ్, 5 వార్డులు, కొడంగల్ 5 వార్డులు‌, 1 ఎంపిటిసి, కోట్ పల్లి 1 వార్డు, కుల్కచర్ల 1 సర్పంచ్, 15 వార్డులు, 1 ఎంపిటిసి, మర్పల్లి 8 వార్డులు, మోమిన్ పేట్ 68 వార్డులు, నవాబు పేట్ 41 వార్డులు, 1 ఎంపీటీసీ, పరిగి 1 సర్పంచ్, 10 వార్డులు, పెద్దేముల్ 1 సర్పంచ్, 64 వార్డులు, పూడూరు 1 సర్పంచ్, 4 వార్డులు, తాండూరు 3 వార్డులు, వికారాబాద్ 1 సర్పంచ్, 10 వార్డులు, యాలాల్ 2 సర్పంచులు, 5 వార్డులో ఎన్నికలు జరుగనున్నట్లు ఆడిషన్ కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మల్లారెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారి రాజేంద్ర ప్రసాద్, ఎన్నికల విభాగం తహసిల్దార్ శ్రీధర్, పెద్ది అంజయ్య (బిఎస్పి), మహేష్ కుమార్ (కాంగ్రెస్), మిర్జా ఫేరోజ్ బేగ్ (ఏఐఎంఐఎం), గోపాల్ రెడ్డి, పీర్ మహమ్మద్ (సిపిఐ), మయూర్  సర్సర్ (ఎస్ఎఫ్ బి) లు పాల్గొన్నారు.