మండలం లోని ప్రధాన సమస్యలపై మండల పరిషత్ సమావేశంలో చర్చ

Published: Tuesday January 11, 2022

మధిర జనవరి 10 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మండ ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షులు లతా ఎండిఓ భాస్కర్ రెడ్డి ఎమ్మార్వో రాజేష్ సమావేశంపలు అంశాలపై సమావేశం జరిగింది మండలంలో 5137 మందికి పెన్షన్లు మంజూరు కావాల్సి ఉంది. కరోనాతో ఖజానా ఖాళీ ఐనది. అందువల్లే పెన్షన్ల మంజూరులో జాప్యం జరుగుతుందని ఎంపీపీ లలిత తెలిపారు. ఐనా కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేస్తాం మిషన్ భగీరథ నీళ్లు వాడటం వల్ల దద్దుర్లు వస్తున్నాయి సైడేల్లీ పురం సర్పంచి పులిబండ్ల చిట్టిబాబు ఆరోపణ మిషన్ భగీరథ నీళ్లు పచ్చగా వస్తున్నాయని అల్లినగరం ఎంపిటిసి జయరాజ్ ఆరోపణ దీనిపై మిషన్ భగీరథ ఏఈ మాట్లాడుతూ మిషన్ భగీరథ వాటర్ క్వాలిటీలో ఎటువంటి రాజీ లేదు. పైపులైన్లు ఎక్కడ సమస్య ఉన్న తక్షణమే పరిష్కారం చేస్తున్నాను. పచ్చ కలర్ పై ల్యాబ్ టెస్టింగ్ చేయిస్తాను బయ్యారం గ్రామంలో 110 రేషన్ కార్డులో ఉన్నా రేషన్ షాప్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాం. తహశీల్దార్ రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు