కోరట్ల గూడెం గ్రామంలో మహా అన్నదానం కార్యక్రమం

Published: Tuesday September 21, 2021
పాలేరు, సెప్టెంబర్ 19, ప్రజాపాలన ప్రతినిధి : నెలకొండపల్లి మండల కోరట్ల గూడెం గ్రామంలో సమ్మక్క సారక్క గుడి  దగ్గర శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ నిమజ్జనం సందర్భంగా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథుల గా ఎస్సై అశోక్ రెడ్డి పాల్గొని అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా SI అశోక్ రెడ్డి మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు జరగనున్న నవరాత్రులులను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ మండపాల వద్ద ప్రతి ఒక్కరు నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ కీ తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో కోరట్ల గూడెం ఎంపీటీసీ రేగూరి వాసవి గారు గ్రామ పెద్దలు కొత్తపల్లి వీరయ్య కొత్తపల్లి సుబ్బయ్య వైస్ సర్పంచ్ వాసంశెట్టి నాగేశ్వరరావు బచ్చల కూరి నాగరాజు మార్తి కోటేశ్వరరావు వాసంశెట్టి వెంకట్రామయ్య పసుపులేటి వెంకటేశ్వర్లు యూత్ వాసంశెట్టి హరి మార్తి భరత్ రావూరి క్రాంతి సత్యాల గోపి రసీం శెట్టి తేజ గురిజాల గోపి తాళ్లూరి మోహన్ కృష్ణ గురజాల జి వి ఆర్ పెద్దలు పిల్లలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.