మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మేల్యే డా.సంజయ్

Published: Thursday September 01, 2022

జగిత్యాల, ఆగస్టు 31 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణ మార్కండేయ కమాన్ వద్ద బాలాంబిక ఫౌండేషన్ వారి అధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ  కార్యక్రమంలో పాల్గొని భక్తులకు మట్టి విగ్రహాలు  ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ పంపిణీ చేసినారు. అనంతరం మార్కండేయ ఆలయం లో ఎమ్మేల్యే ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు వేద మంత్రోచ్చారణ చేయగా, పద్మశాలి సంఘ నాయకులు ఎమ్మేల్యే ను ఘనంగా సన్మానించారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ మట్టి విగ్రహాల ప్రతిష్ట పర్యావరణ హితం అని అన్నారు. ప్లాస్టిక్, తదితర రసాయనాల వల్ల చెరువులు నదులు సముద్రాలు కలుషితం అవుతున్నయి అని అది మానవాళికి చేటు అన్నారు. చిన్న తనం లో ఇంట్లో మట్టి విగ్రహాల ప్రతిష్ట చేపట్టే వారమని బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో  కౌన్సిలర్ అల్లే గంగ సాగర్,పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, భోగ ప్రవీణ్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, నాయకులు జేడి, ఒల్లాల గంగాధర్, కొలాగాని సత్యం, అడేపు సత్యం, వేణు మాధవ్, ఫౌండేషన్ సభ్యులు సాయి వరుణ్, వంశీ, రత్నాకర్, బాలాజీ, నవీన్, సాయి కిరీటి, గణేష్, రాజు, మహేష్, రవిచంద్, సర్వేశ్వర్, జయంత్ నేత, నవీన్, రామ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.