వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో గులాబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన వివిధ రకాల పంటలను మరియు ప్

Published: Thursday September 30, 2021
మధిర, సెప్టెంబర్ 29, ప్రజా పాలన ప్రతినిధి : మధిర మండల పరిధిలోని గులాబ్ తుఫాన్ వల్ల వచ్చిన వరదల వల్ల వివిధ గ్రామాల్లో రైతులు వేసిన పంటలు మిర్చి మొక్కజొన్న ప్రతి మరియు కూరగాయ పంటలు బెండ బీరా దోస పంటలు పూర్తిగా తుఫాన్ వల్ల దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు ఆంధ్ర ప్రాంత సరిహద్దు అయిన చిలుకూరు గ్రామంలో రైతాంగం ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు ప్రకృతి వైపరీత్యాల కారణంగా వచ్చే వరదల వల్ల రాత్రనకా పగలనకా కష్టపడి చంటి బిడ్డ లాగ పెంచుకుంటున్న పంట పొలాలు నాశనం అవ్వడం రైతాంగం కన్నీరుమున్నీరవుతున్నారు తక్షణం తెలంగాణ ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టకుండా వరదల వల్ల నష్టపోయిన పంటలను అంచనావేసి ఇ వారికి తక్షణ సహాయం కింద ఎకరానికి లక్ష రూపాయలు రూపాయలు ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది పంట నష్టం నిమిత్తం తక్షణం నష్టపోయిన ప్రతి రైతు కుటుంబానికి ఆసరాగా ప్రభుత్వం అండగా నిలిచి కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పై ఉన్నది క్షేత్ర స్థాయి అధికారులను పంపి పంట నష్టం అంచనాలు వేసి సమగ్ర నివేదికను చెప్పించుకుని ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని వారికి పంట బీమా ను అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం రైతులు రైతు కుటుంబాలను ఆనాడు కాపాడి నటువంటి వైనం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులను తక్షణం ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం అనంతరం స్థానిక తాసిల్దార్ కార్యాలయం వెళ్లి వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు సొంత మాల మురహరిదేవవం భట్ల శ్రీనివాస శాస్త్రి తీర్ధాల శ్రీనివాసరావు బద్రి తదితర రైతులు రైతు కూలీలు పాల్గొన్నారు