రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు చిరు కానుక

Published: Friday May 07, 2021
పరిగి, మే 6, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో ( రంజాన్ ఈద్-ముబారక్ ) పండగ ఒకటి అన్ని జడ్పీటీసీ నాగి రెడ్డి అన్నారు. పండగ ఈ నెల 14 తేదీన ఉండటం వలన ఈ పండగను పునస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ముస్లిం సోదరులకు దుస్తులు పంపిణీ చేస్తుందని సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు దోమ మండలం కు 250 కిట్లు వొచ్చాయని పేద ముస్లిం కుటుంబాలను ఎంపిక చేసి ఇవ్వాలని రెవిన్యూ అధికారులకు సూచించారు స్థానికంగా ఉన్న ముస్లిం నాయకులు మత పెద్దలు కూడా సహకరించి పేదలకు మాత్రమే అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమం లో కో ఆప్షన్ సభ్యులు ఖాజా పాషా ఉప సర్పంచ్ లు గోపాల్. రఫీ. వార్డ్ సభ్యులు లక్ష్మణ్. మైను.గౌస్. సదర్ ఉమర్ డ్యూపీటీ తహసీల్దార్ రాజేందర్ రెడ్డి ఆర్ఐ రాజేందర్, తెరాస నాయకులు ఆంజనేయులు. ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.