ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధి.

Published: Thursday September 22, 2022

   *మైనింగ్ జోన్ రైతులకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం*

*బండరావిరాల,చిన్న రవిరాల గ్రామాల రైతుల దీక్షలు*

*కలెక్టర్ తో మాట్లాడి సమస్యను వారం రోజుల్లో పరిష్కరం కోసం చొరవ చూపిన ఎంపీ కోమటిరెడ్డి

రంగారెడ్డి జిల్లా  అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని బండరావిరాల,చిన్న రావిరాల గ్రామాలలో 268 సర్వేనెంబర్ గల భూమిని 1972 నుండి1999 వరకు నాలుగు విడతలుగా   209 మంది రైతులకి పట్టాల ప్రభుత్వం జారీ చేసింది ఇందులో దళితులు బీసీలు వెనుకబడ్డ తరగతుల వారికి  అసైన్మెంట్ పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది అట్టి భూమిని 50 సంవత్సరాలు నుండి సాగు చేసుకుని జీవిస్తున్న 209 కుటుంబాలలో నోట్లో మట్టి కొట్టి అప్పటి ప్రభుత్వం 2004 సంవత్సరం మైనింగ్ జోన్ కింద ఆ భూములను తీసుకొని ప్రతి కుటుంబానికి నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు రైతులు మాత్రం రోడ్డున పడ్డారు నష్టపరిహారం వచ్చేంతవరకు నిరాహార దీక్ష కొనసాగిస్తామని గ్రామ రైతులు వాపోతున్నారు ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నారా చంద్రబాబు నాయుడు   రైతులు  ఆధ్వర్యంలో మెమొరండాలు అందించారు నటి నుండి నేటి వరకు మంత్రులకు ఎమ్మెల్యేలకు అధికారులకు మెమోరెండాలు ఇస్తూ వస్తున్నారు రాజకీయ నాయకులు ససైమేర అంటే  హైకోర్టును రైతులు ఆశ్రయించగా మార్కెట్ వాల్యూ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వనికి సూచించింది ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రైతులకు ఎన్నికల అప్పుడు అప్పుడు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట చెప్పుతూ కాలం వెల్లబుస్తున్నాడు 209 మంది రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కానీ రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది రైతులు తెలిపారు కంకర మిషన్లు ఏర్పాటు చేసిన నుండి అనేకమంది రైతులు ప్రజలు పొల్యూషన్ రావడంతో  రోడ్డు ప్రమాదంలో  వంద మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు అయినప్పటికీ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఇంతవరకు ఇలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమని  రైతులు ఆవేదన వ్యక్తంచేశారు  37వ రోజు నిరవధిక సమ్మెలో పాల్గొనే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాహుల్ గాంధీ పాదయాత్రకి కోమటిరెడ్డికి ఆహ్వానం రావడంతో తప్పని పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చిందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ  కలెక్టర్ ఫోన్ ద్వారా సంప్రదించగా రైతులకు యాభై మందికే పట్టాలు ఉండటంతో ఇది కరెక్ట్ కాదని 209 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని వారు తెలియజేసారు వారం రోజులోగా రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా చూడాలని అధికారులకు తెలియజేసారు లేని పక్షంలో భూ బాధితుల అందరితో కలిసి ఉద్యమని ఉదృతం చేస్తామని  ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బండరావిరాల గ్రామ సర్పంచ్ కవడపు శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి భూ నిర్వాసితుల అధ్యక్షలు బంగారి మైసయ్య,ఉపాధ్యక్షులు బంగారి నర్సింగ్ రావు వ్యవస్థాపకులు ఐలయ్య రైతులు మల్లేష్ నేత కృష్ణ బసమ్మ మనెమ్మ ఎల్లమ్మ రైతులు తదితరులు పాల్గొన్నారు.