పేదల కోసమే ముఖ్యమంత్రి సహాయనిధి

Published: Friday June 18, 2021
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జూన్ 17 ప్రజాపాలన బ్యూరో : దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో తోడ్పడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో వికారాబాద్ నియోజక వర్గానికి సంబంధించిన లబ్ధిదారులకు మంజూరైన రూ.17,01,500 (రూపాయలు పది హేడు లక్షల ఒక్క వెయ్యి ఐదు వందలు) విలువ గల 34 చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అనారోగ్యానికి గురై అత్యవసర సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వ దవాఖానాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. సీఎం నిరంతర కృషితోనే ఆపత్కాలంలోనూ పథకాలు కొనసాగుతున్నాయని గుర్తు చేశారు. 
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి :
గురువారం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై ఇరిగేషన్ శాఖ అధికారులతో, కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. నిర్మాణంలో నాణ్యత ఎక్కడ కూడా లోపించకుండా కాంట్రాక్టర్లు జాగ్రత్త వహించాలన్నారు. నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించే విధంగా అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఇసుక, సిమెంట్ కొరత లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ మోతీలాల్ కు ఫోన్ చేసి తెలియజేశారు. విద్యుత్ ఫోల్స్ షిఫ్టింగ్ వలన నిర్మాణానికి అంతరాయం ఏర్పడకుండా త్వరగా షిఫ్టింగ్  చేయాలని విద్యుత్తు అధికారులను ఆదేశించారు. విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే : ధారూర్ మండలం కెరెళ్ళి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి విద్యుత్ షాక్ కు గురై హైదరాబాద్ లో చికిత్స పొందుతూ గురువారం మరణించడం జరిగింది. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, త్వరగా పోస్టుమార్టం నిర్వహించాలని ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, అనిల్, శ్రీకాంత్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, నవీన్ కుమార్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, వైస్ ఎంపీపీ విజయ్, ఎఎంసి మాజీ వైస్ చైర్మన్ సంతోష్ కుమార్, ఇరిగేషన్ శాఖ డిప్యూటీ ఈఈ రవి కుమార్, జితేందర్, భాస్కర్ గౌడ్, AE లు సుకుమార్, వరప్రసాద్, రాయుడు, కాంట్రాక్టర్స్ మరియు సైట్ ఇంజనీర్స్, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.