ఎర్రవల్లి గ్రామాన్ని పారిశుద్ధ్య రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

Published: Monday June 06, 2022
సర్పంచ్ చొప్పరి మల్లమ్మ హనుమంతు ముదిరాజ్
వికారాబాద్ బ్యూరో 03 జూన్ ప్రజాపాలన : పారిశుద్ధ్య రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఎర్రవల్లి గ్రామ సర్పంచ్ చొప్పరి మల్లమ్మ హనుమంతు ముదిరాజ్ అన్నారు. ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ చొప్పరి మల్లమ్మ హనుమంతు ముదిరాజ్ ఉప సర్పంచ్ నజీమున్నీసా గఫార్ పంచాయతీ కార్యదర్శి నరేందర్ రెడ్డిలు ఐదవ విడత పల్లె ప్రగతిలో భాగంగా శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి రోడ్డును శుభ్రపరిచామని పేర్కొన్నారు. గ్రామ అంతర్గత రోడ్లకు ఇరువైపుల ఉన్న పిచ్చి మొక్కలను తొలగించామని స్పష్టం చేశారు. ఇండ్ల మధ్యలో ఉన్న పిచ్చి మొక్కలను వ్యర్థ గడ్డిని తీసేశామని వివరించారు. ఇంటి ముందు మోరీలలో వ్యర్థ పదార్థాలను వేయరాదని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యంగా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని హితువు పలికారు. గ్రామాభివృద్ధికి ప్రజలు భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు.