బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటా ఫివర్ సర్వే

Published: Saturday May 08, 2021
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారిగా ఇంటింటా ఫివర్ సర్వే నిర్వహించి అనుమానితుల నుంచి శాంపిల్స్‌ సేకరించి, పరీక్షలు నిర్వహించి, వైరస్‌ నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి అన్నారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్న టీం సబ్యులకు థర్మ మీటర్, ఫేస్ షీల్డ్, మాస్క్, గ్లోవ్స్, శానిటైజేర్ లు అందజేస్తునమన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రాజేంద్ర కుమార్, డాక్టర్ రాధిక, ఆర్ ఓ శ్రీధర్, పర్యావరణ ఇంజినీర్ సాయికిరణ్ రెడ్డి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ వినోద్, తదితరులు పాల్గొన్నారు..