ప్రశాంతంగా ముగిసిన మత్స్య సహకార సంఘం ఎన్నికలు

Published: Friday July 29, 2022
మధిర జులై 28 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు మత్స్య సహకార సంఘం ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంటకు ముగిసింది. మధిర మత్స్య సహకార సంఘం పరిధిలోని మధిర, మడుపల్లి, మాటూరు, రాయపట్నం, దేశినేనిపాలెం చెరువులు ఉన్నాయి. మొత్తం 396 ఓట్లు ఉండగా 390 మంది ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం తొమ్మిది మంది డైరెక్టర్ల పదవులు కోసం 19 మంది పోటీపడ్డారు. ఎన్నికల్లో ఎటువంటి ఘర్షణ జరగకుండా సీఐ వడ్డేపల్లి మురళి ఆధ్వర్యంలో ఎస్సై సతీష్ కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారిగా సిహెచ్ రవికుమార్ వ్యవహరించారుపులిపాటి సుబ్బారావు ఫ్యానల్ ఘనవిజయంమధిర మత్స్య సహకార సంఘం ఎన్నికల్లో పులిపాటి సుబ్బారావు ప్యానల్ మొత్తం తొమ్మిది వార్డులను గెలుచుకొని సంచలన సృష్టించింది. గురువారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి అనంతరం రెండు గంటల నుండి ఓట్ల లెక్కింపు చేపట్టారు ఎన్నికల్లో డైరెక్టర్లుగా విజయం సాధించారు. గెలుపొందిన వారిలో
పులిపాటి సుబ్బారావు, చింతల వీరయ్య, చిలకారాజేంద్రప్రసాద్,గద్దలవిజయకుమార్,
గద్దల లాలయ్య,గద్దల చిన్ని, చాటారి అలివేలు, బాద్దే కాంతమ్మ,
పిల్లి మోజేష్య్ తదితరులు ఉన్నారు.
నేడు చైర్మన్ ఎన్నికమధిర మత్స్య సహకార సంఘం ఎన్నికల్లో గెలుపొందిన డైరెక్టర్లు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం వారిలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు.