తెలంగాణ లో అర్హులైన దళితులందరికి ఏకకాలంలో దళితబంధు అమలుచేయాలి.

Published: Friday July 23, 2021
కొడిమ్యాల, జూలై 22 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలం కేంద్రంలో విలేకరులతో (టి డబ్ల్యూ ఎఫ్) వార్డు నెంబర్ల ఫోరం మండల అధ్యక్షులు మొగిలి మల్లేశం మాట్లాడుతూ అర్హులైన దళిత కుటుంబాల అందరికి రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దళితబంధు పథకాన్ని అమలు చేయాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. గత 7సంవత్సరాల నుండి గుర్తుకు రాని దళితులు ఈ హుజురాబాద్ ఎన్నికలు రాగానే గుర్తుకువచ్చారా దళితులకు ఇస్తానన్న 3ఎకరాల భూమి ఇవ్వలేదు. దళితులకు డబుల్ బెడ్ రూమ్  ఇస్తానని ఇవ్వలేదు. మీరు ఇస్తానని హామీ ఇచ్చిన పథకాలలో ఎంత మంది దళితులకు ఇచ్చినారో చెప్పాలన్నారు. పథకాలు అనేవి జీఓ ల వరకే పరిమితం కాకుండా అమలు చేసి సత్తా చాటుకోవాలన్నారు.. కెసిఆర్ ప్రభుత్వానికి నిజంగా దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రవేశపెట్టిన దళితబంధు పథకం హుజురాబాద్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్ర వ్యాప్తంగా వున్నా దళిత కుటుంబలా అందరికి ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.