ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వద్ద భద్రత ఏర్పాటు చేయాలి వినతి పత్రం

Published: Monday May 09, 2022

ఇబ్రహీంపట్నం మార్చ 8 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వద్ద ఉన్న పలు సమస్యలపై ఏబీవీపీ వీరపట్నం శాఖ ఆధ్వర్యంలో ఎస్.ఐ అరుణ్ కుమార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో తరచుగా నీటిలో దూకి ఆత్మహత్యలు మరియు ఇతర ప్రదేశాల్లో చంపి ఈ యొక్క చెరువులో మృతదేహాలను వేయడం జరుగుతుంది. కావున ఇబ్రహీంపట్నం పోలీస్ శాఖ వారు ప్రత్యేకంగా చెరువు చుట్టుప్రక్కల గస్తీ నిర్వహించాలని కోరుకుంటున్నాము. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మరియు మున్సిపాలిటీ శాఖ వారు చెరువు యొక్క ప్రాంతంలో సూచిక బోర్డులు పెట్టగలని. నిత్యము చెరువులో చేపలు వేటకు చాలా మంది వెళ్లడం జరుగుతుంది, అక్కడ త్రుటిలో జారి పడే అవకాశం ఉంది. చెరువులో నీటి అంతర్భాగంలో పెద్దపెద్ద సర్కార్ కంప చెట్లు ఉన్నాయి కావున నీటిలో వాహనాలను కడగుతున్నటువంటి వారిని ఎవరిని లోపలికి అనుమతులు లేకుండా చర్యలు తీసుకోగలరు. ప్రత్యేకించి తూము వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి.కావున వీటన్నిటి పై చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎబివిపి ద్వారా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాలపల్లి. శశిధర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ వంగ. సంజీవ రెడ్డి, విభాగ్  ఎస్ ఎఫ్ డికన్వీనర్ దుసరి. సందీప్, సోషల్ మీడియా కన్వీనర్ మేలారం. పవన్, నగర ఉపాధ్యక్షులు ముదిగొండ. సాయి తేజ, సంయుక్త కార్యదర్శి తోర్రమామిడి. సంతోష్, ఎస్ ఎఫ్ ఎస్ కన్వీనర్ ముత్యాల. సాయి చందు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.