బోడుప్పల్లో స్టార్ ఫిట్నెస్ యూనిసెక్స్ సెలూన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Published: Tuesday July 06, 2021
మేడిపల్లి, జులై5 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ ప్రధాన రహదారిలో ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా ఆకృతి అపార్ట్మెంట్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ ఫిట్నెస్ స్టూడియో మరియు స్టార్ యూనిసెక్స్ సెలూన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శారీరక దృఢత్వంతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఫిట్నెస్ స్టూడియోలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ టీఆర్ఎస్ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, కార్పొరేటర్ శ్రీవిద్య,సుమన్ నాయక్, టీఆర్ఎస్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, దర్గా దయాకర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, బచ్చ రాజు, శ్రీధర్, నాగిరెడ్డి, ఎస్. ఎఫ్. ఎస్. నిర్వాహకులు మహమ్మద్ జావిద్ వారి కుటుంబ సభ్యులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.