వ్యవసాయ మార్కెట్లను పటిష్ఠం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

Published: Tuesday October 12, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్ బ్యూరో 11 అక్టోబర్ ప్రజాపాలన : పారదర్శకతతో నూతన వ్యవసాయ పాలకవర్గం ముందుకు కొనసాగాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హితవు పలికారు. సోమవారం వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని ధారూర్ మండల కేంద్రంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డెగావత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో ధారూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షులుగా ముచ్చర్ల సంతోష్ కుమార్ గుప్తా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా అవుసుపల్లి అంజయ్య, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హరిదాస్ పల్లి నుండి స్టార్ ఫంక్షన్ హాల్ వరకు భారీ జనసందోహంతో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ బైక్ ర్యాలీగా వెళ్లి ధారూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తమ పరిధిలో గల రైతులకు ఉత్పత్తులను మార్కెట్ కమిటీ యార్డులోనే అమ్మేవిధంగా అవగాహన కల్పించాలని సూచించారు. తూకం సమయంలో అవకతవకలు జరగకుండా మార్కెట్ కమిటీ యంత్రాంగం పకడ్బందీగా పర్యవేక్షణ చేయాలని వివరించారు. గోడౌన్లు ఆర్ బిపి కింద స్టాక్ నిల్వకోసం నిర్మించబడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో ధారూర్ మండల జెడ్ పిటిసి కోస్నం సుజాత వేణుగోపాల్ రెడ్డి, ధారూర్ మండల ఎంపిపి విజయలక్ష్మి, ధారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కావలి అంజయ్య, ధారూర్ మండల రైతు బంధు అధ్యక్షుడు రుద్రారం వెంకటయ్య ముదిరాజ్, ధారూర్ మండల టిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కోస్నం వేణుగోపాల్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ రాములు, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ రాజు గుప్తా, వైస్ ఎంపీపీ విజయ్ నాయక్, టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.