దళిత ఎన్ఫో ర్ మెంట్ పథకాన్ని వ్యతిరేకిస్తున్నాం : బెల్లంపల్లి బిజెపి ఎస్సీ మోర్చా

Published: Tuesday June 29, 2021

బెల్లంపల్లి, జూన్ 28, ప్రజాపాలన ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నాడు దళిత్ ఎన్ఫోర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించ డాన్ని భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి ఎస్సీ మోర్చా శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని నాయకులు అన్నారు. సోమవారం నాడు బెల్లంపల్లి లో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చ పట్టణ కమిటి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నిన్న కేసీఆర్ దళిత ఎన్ఫోర్మెంట్ పతాకనికి ఆమోదం తెలపడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామనీ, దళితులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రకటించిన దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై 125 అడుగుల రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాము, ఇలాంటి వాటిపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలే తప్ప హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మళ్ళీ కళ్ల బొల్లి, మాయ మాటలు చెప్పి, గారడి వేషాలు వేస్తూ, జోలెపట్టుకొని హుజురాబాద్ వస్తున్నావు కానీ దళితులు మీకు తగిన గుణపాఠం చెపుతారనీ, మా దళితులు దుబ్బాకలో ఎలాగ సమాధానం చెప్పారో అదేవిధంగా హుజురాబాద్ లో కూడ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోడి, రమేష్, ఎస్ సి మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల, శ్రీనివాస్, ఎస్సీ మోర్చ జిల్లా కార్యదర్శి కోడి, సురేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు సబ్బని, రాజనర్సు, ఎస్సీ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎరుకల, నర్సింగ్, పట్టణ లీగల్ సెల్ నాయకులు గోలి, శ్రీనివాస్, సీనియర్ నాయకులు రెవెళ్లి, రాజలింగు తదితరులు పాల్గొన్నారు.