క్షేత్ర స్థాయిలో ప్రజలను కలుస్తూ... పంటలను పరిశీలిస్తూ.. చెరువును సందర్శన విద్యా, వైద్యం, ఉపాధ

Published: Wednesday November 16, 2022
క్షేత్ర స్థాయిలో ప్రజలను కలుస్తూ... పంటలను పరిశీలిస్తూ.. చెరువును సందర్శన
 
విద్యా, వైద్యం, ఉపాధి లపై వివరాలు సేకరించిన బృందం.
 
 
పాలేరు నవంబర్ 15  ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
ప్రభుత్వ పధకాల అమలు గురించి తెలుసుకునేందుకు ఢిల్లీ నుంచి
 
వచ్చిన పార్లమెంట్ లోని సెక్రటేరియట్ కు అసిస్టెంట్ సెక్షన్ అధికారులు మండలంలోని మండ్రాజుపల్లి లో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. రెండో రోజు మంగళవారం కేంద్ర అధికారుల బృందం మిధనుర్మాన్,
 
ప్లయిస్సింగ్, రవిషక్కుమార్, తేజేందర్ సింగ్ లు ఉదయం 5 గంటల నుంచే కార్యక్రమాలు చేపట్టారు. తొలుత రైతు వేదిక నుంచి చెరువు వరకు వాకింగ్ చేశారు. మార్గమధ్యలో కలిసిన గ్రామస్తులతో ముచ్చటించారు. గ్రామంలో వరి పంట పొలాలను, చెరుకు తోటలను
 
పరిశీలించారు. గడ్డి కోసే రైతులు వద్ద కు వెళ్లి పశుగ్రాసం తో ప్రయోజనాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయం, పాడి పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే పధకాల గురించి ఆరా తీశారు. వైద్య శాఖ కు సంబంధించి బోదులబండ పీహెచ్సీ ని సందర్శించి వైద్యాధికారి ని పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేర్వేర్ గా గా అడిగి తెలుసుకున్నారు. విద్య గురించి పాఠశాలను కలిసి పాఠశాల బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు. గ్రామంలో పలు వీధుల్లో పర్యటించి ప్రజల నుంచి పలు అంశాల పై వివరాలు
 
కోవిడ్ సమయంలో వైద్య శాఖ అందించిన సేవలు గురించి సిబ్బంది
సందర్శించి బోధన గురించి తెలుసుకున్నారు. సరదా గా విద్యార్థులతోకలిసి పాఠశాల బస్సులో కొద్ది దూరం ప్రయాణించారు. గ్రామంలో పలు వీధుల్లో పర్యటించి ప్రజల నుంచి పలు అంశాల పై వివరాలు.  అనంతరం రైతు వేదికలో ఐకేపీ, ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖల పై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కె.జమలారెడ్డి, మండల పంచాయతీ అధికారి సిహెచ్.శివ, చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, ఎంపీపీ వజ్జా రమ్య, సర్పంచ్ నెల్లూరి అనురాధ. పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.