పోలీస్ ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ పరీక్ష ప్

Published: Saturday July 23, 2022

ఆసిఫాబాద్ జిల్లా జూలై22 (ప్రజాపాలన, ప్రతినిధి) : ఆగస్టు 7వ తేదీన నిర్వహించబోయే ఎస్సై పోస్టుల నియామక పరీక్ష ను పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ అన్నారు. శుక్రవారం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నియామవళి మేరకు పరీక్షా కేంద్రాల నిర్వాహకులకు జిల్లా పోలీస్ కేంద్రంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్ష రీజినల్ కో- ఆర్డినేటర్ శ్రీధర్ సుమన్ పరీక్ష కేంద్రాల్లో వసతుల గూర్చి చీఫ్ సూపరింటెండెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గూర్చి తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 1492 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ రాత పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 10 గం నుండి, మధ్యాహ్నం 1గం వరకు నిర్వహించాలని అన్నారు. పోలీస్ నోడల్ అధికారి అచ్చేశ్వర్ రావు మాట్లాడుతూ త్వరలో బయోమెట్రిక్ హాజరు కు గాను బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ల కు తగు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫర్నిచర్, వెలుతురు, నీటి వసతి, ఏర్పాటు చేయాలని, ఇలాంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, రూట్ అధికారులు, పోలీస్ ఐటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.