సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిని...

Published: Tuesday March 29, 2022
ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి మార్చి 28: కోస్గి : కోస్గి సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో పదవతరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలను ఉద్దేశించి స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. సోమవారం మండల పరిధిలో మీర్జా పూర్ గ్రామ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులకు 400 రూపాయల విలువ చేసే స్టడీ మెటీరియల్ ను అందించారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి సత్య సాయి సేవ సమితి సభ్యులు అనంత లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థులు పదవ తరగతి లో 10 GPA సాధించే విధంగా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా మంచి క్రమ శిక్షణ తో ఉన్నత విలువలతో జీవితంలో అభివృద్ధి చెందాలని మీ తల్లి తండ్రులకు, ఉపాధ్యాయులకు, ఊరికి మంచిపేరు తేవాలని.. భవిష్యతిలో ప్రతిఒక్కరు మంచి సేవా గుణాన్ని పెంపొందించుకోవాలని సూచించారు... మా పాఠశాల విద్యార్థులకు పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఉపయోగకరమైన స్టడీ మెటీరియల్స్ అడిగిన వెంబడే కాదనకుండా ఇచ్చినందుకు... పాఠశాల తరపున విద్యార్థుల తల్లి తండ్రుల తరపున, మా ఉపాధ్యాయుల తరపున ప్రత్యేక అభినందనలు.. మరియు ధన్యవాదములు అని ప్రధానోపాధ్యాయులు ఆనంతప్ప గారు తెలియజేసారు... ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవ సమితి కన్వినియర్ విష్ణు సభ్యులు, కేనం శివరాజ్, మల్లికార్జున్ రిటైర్డ్ టీచర్, అడవి శ్రీనాథ్ మరియు గ్రామ సర్పంచ్ వీరేంధర్ రెడ్డి ఉపాధ్యాయులు సిద్దిరాములు, వినోజ్, త్రిగుణ, భీమయ్య, చిన్నయ్య, రాజు, వీరేంధర్, రాజమని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.