ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్ర

Published: Monday January 09, 2023

 

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం  ఉప్పుసాక గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ &, పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్పా ర్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ బిజెపి పార్టీల నుంచి  సుమారు 400 కుటుంబాలు సీఎం కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు, ఆకర్షితులై బిఆర్ఎస్  పార్టీలో చేరారు, వారికి గులాబీ కండవా కప్పి పార్టీలోకి సాదరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు ఆహ్వానించారు, అనంతరం వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలుకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్  పార్టీలో చేరుతున్నారని అన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ గారి పరిపాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు, సీఎం కేసీఆర్ గారు నిత్యం పేద ప్రజల రైతుల బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు, గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన ఇంతటి అభివృద్ధి, ఇలాంటి పరిపాలన చేసిన సీఎం ఎవరు లేరని ప్రజలు గ్రహించి సీఎం కేసీఆర్ గారు చేసే అభివృద్ధికి ప్రజల ఆనందాన్ని తెలుపుతున్నారు, ఎవరికి సాధ్యం కానీ సీఎం కేసీఆర్ గారి వల్ల తెలంగాణ అభివృద్ధి బాటలతో పయనిస్తున్న తెలంగాణను సీఎం కేసీఆర్ గారితో సాధ్యమవుతుందని అన్నారు, పినపాక నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అన్నారు, ప్రతి కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు, బిఆర్ఎస్  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు పట్టణాలు రూపురేఖలు మారిపోయాయని ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్ యార్డ్ రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించిందని అన్నారు,కళ్యాణ లక్ష్మి , షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం అని, మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు. కళ్యాణ లక్ష్మీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00,116/- రూపాయల ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది అని అన్నారు, జనవరి 18 నుండి రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం కానున్నది అన్నారు, కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు సమావేశాలు నిర్వహించి సమన్వయంగా పనిచేయాలన్నారు , కంటి వెలుగులు అందిస్తున్న అద్దాలు కూడా చాలా బాగున్నాయని అవసరం వారందరికీ అద్దాలు అందేలా కృషి చేయాలన్నారు,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్య అందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు, మను ఊరు మనబడి కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను బలోపేతం చేస్తున్నదని అన్నారు, గత పాలకవర్గాల నిర్లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలు పోయాయ అన్నారు, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యారంగా రక్షణకు శ్రీకారం చుట్టిందన్నారు, రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి వర్గాల పిల్లలను ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తుంది అన్నారు, గ్రామస్తులు పాఠశాల అభివృద్ధిలో భాగ్యస్వామ్యులు కావాలన్నారు, తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాల చర్చించి ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు, మన ఊరు మనబడి ద్వారా 7281 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి వివిధ రకాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి అన్నారు, నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ గారు ప్రత్యేకంగా 100 కోట్లు ఇచ్చారని ఆయన అన్నారు*
ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండలం  జడ్పిటిసి కామారెడ్డి శ్రీలత, మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్జా ప్రెసిడెంట్ జలగం జగదీష్, పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాసరావు సార్పాక టౌన్ ప్రెసిడెంట్ శ్రీను, మాజీ ఎంపీటీసీ తోటమల్ల సరిత తోటముల బిక్షం, నడకం లక్ష్మీనారాయణ రెడ్డి, బాలాజీ, సాయిబాబా, గోవర్ధన్, ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు*
 
 
 

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం  ఉప్పుసాక గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ &, పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్పా ర్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు సమక్షంలో కాంగ్రెస్ బిజెపి పార్టీల నుంచి  సుమారు 400 కుటుంబాలు సీఎం కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు, ఆకర్షితులై బిఆర్ఎస్  పార్టీలో చేరారు, వారికి గులాబీ కండవా కప్పి పార్టీలోకి సాదరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు గారు ఆహ్వానించారు, అనంతరం వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు