శభాష్ అంటూ ప్రజలు ప్రజాప్రతినిధులు మెచ్చిన అధికారి మధిర సిఐ మురళి మధిర అక్టోబర్ 19 ప్రజా పాలన

Published: Thursday October 20, 2022
భారత స్వతంత్ర, జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు విజయవంతంలో సిఐ పాత్ర అమోఘందాతల సహకారంతో మధిర సర్కిల్ కార్యాలయాన్ని నిర్మించిన సీఐ మురళిమధిర సిఐగా మురళి బాధ్యతలు స్వీకరించి నేటికి రెండేళ్లు పూర్తి*
మధిర సిఐగా వడ్డేపల్లి మురళి బాధ్యతలు స్వీకరించి బుధవారం నాటికి రెండేళ్లు పూర్తయింది. రెండేళ్లుగా సిఐగా విధులు నిర్వహించిన మురళి ఎక్కడా హడావుడి చేయలేదు హంగామా సృష్టించలేదు. తన విధులను బాధ్యతతో నిర్వహిస్తూ శాంతి భద్రతల పర్యవేక్షణ చేస్తూ మధిర ప్రజల్లో సీఐ మురళి సుస్థిరస్థానం పొందారు. మధిర సిఐ మురళి సర్కిల్ పరిధిలో క్రింది స్థాయి సిబ్బందితో నిరంతరం సమన్వయం చేసుకుంటూ శాంతి భద్రతలు కాపాడటమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందారు. అప్పటికే జిల్లాలో సిఐ మురళికి నిజాయితీ అధికారిగా, వివాదరహితుడిగా, శాంతిభద్రతలను కాపాడే విషయంలో సమర్ధుడైన అధికారిగా పోలీస్ శాఖలో పేరుంది. చైతన్యవంతమైన మధిర ప్రజలు మురళి పనితీరును గ్రహించి శాంతిభద్రతల విషయంలో పోలీసు శాఖ తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలిపారు. ప్రజల సహకారం, సిబ్బంది కృషితో సిఐ మురళి పర్యవేక్షణలో వినాయక చవితి ఉత్సవాలు, దసరా ఉత్సవాలు ఎటువంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ప్రజల భాగస్వామ్యంతో మధిరలో భారీ స్థాయిలో విజయవంతం చేయటంలో మధిర సీఐ మురళి పాత్ర ఎంతో అమోఘం అని ఇతర శాఖల అధికారులు ప్రశంసించారు. అంతేకాకుండా జిల్లాలో సంచలనం సృష్టించిన రేమిడిచర్ల, మధిర మైనర్ బాలికల కిడ్నాప్ కేసును సవాల్ గా స్వీకరించి  చేధించారు. మధిర ప్రాంతంలో ఐరన్ షీట్లు చోరీలకు పాల్పడి 12 పోలీస్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదైన అంతర్రాష్ట్ర దొంగలను సీఐ పర్యవేక్షణలో అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు స్కూటీలు ఇస్తానని చెప్పి ప్రజల దగ్గర భారీగా డబ్బులు వసూలు చేసి పరారైన వ్యక్తిని పట్టుకొచ్చి జైల్లో పెట్టారు. సంవత్సరాల తరబడి మధిర పోలీస్ సర్కిల్ కార్యాలయంకు ప్రత్యేకంగా కార్యాలయం లేదు. సీఐగా బాధ్యతలు స్వీకరించిన మురళి అనతికాలంలోనే మధిర సర్కిల్ కార్యాలయం నిర్మాణం పూర్తిచేసి సిపి విష్ణు వారియర్ చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేశారు. యువత గంజాయి బారిన పడకుండా రాత్రివేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేసి గంజాయి తీసుకున్న యువతను అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. సీఐ మురళి సమర్ధుడైన అధికారి కాబట్టే  ఎటువంటి వివాదాలు లేకుండా, పైరవీ కారులను, భజన పరులను దరిదాపుల్లోకి రానివ్వకుండా కట్టడి చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను అమలు చేస్తూ అన్యాయానికి గురైన వారు నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై  తక్షణమే స్పందించి కేసును పూర్వాపరాలు పరిశీలించి న్యాయం చేస్తూ బాధితులకు అండగా నిలిచారు. కరోనా సమయంలో లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలుచేసే మధిరలో కరోనా  వ్యాప్తిని నిరోధించడంలో సఫలీకృతం అయ్యారు. ప్రచారానికి దూరంగా ఉంటూ, అంకితభావంతో విధులు నిర్వహిస్తూ మధిర ప్రజల మన్ననలు పొందిన ఘనత సిఐ మురళికి దక్కిందనటంలో ఎటువంటి అతియోశక్తి లేదు. ఈ సందర్భంగా సిఐ మురళి ఆంధ్ర ప్రభతో మాట్లాడుతూ ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఆదేశాల మేరకు వైరా ఏసీపీ రెహమాన్ పర్యవేక్షణలో మధిర సర్కిల్ పరిధిలోని సిబ్బంది సహకారంతో అంకితభావంతో విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మధిర సర్కిల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.