వలస బతుకులు" కవిత బై బంగారు వి బి ఆచార్యులు

Published: Monday June 13, 2022

ఈ నేలమీదొట్టు

తాగే నీటిమీదొట్టు

ఉన్నఊళ్ళో కూలి దొరక్క

బతికే అవకాశాల్లేక

పట్టణాలకు

పక్క రాష్ట్రాలకు 

వలసెల్లిపోతున్నారు.

 

పట్టణాల్లో

ప్రక్కరాష్ట్రాల్లో జనం

అక్కడాళ్లూ బతకలేకేనేమో

పొరుగుదేశాలకి పరిగెడుతున్నారు.

 

ఉన్నఊర్లో 

పాసిపనులు చెయ్యలేక

పొరుగుదేశాలెల్లి

చీపురు పట్టుకు తుడుస్తున్నారు. 

 

ఇప్పుడు భాదలకేం కానీ

కరోనాకాలం లో చూడాలి. 

ఇక్కడే ఉండి ఏదన్నా తిందామంటే

హోటళ్లు బందు

చేసుకొనే పనులు బందు

వాళ్ళూరెళ్లిపోదామంటే

అన్ని దారులు బందు

చేతికి సంచి తగిలిచ్చుకొని


 

బుజాన్ని బుడ్డోడిని ఎత్తుకుని

నెత్తిమీద మూటెట్టుకొని

కాళ్లకు చెప్పులు లేక

బొబ్బలెక్కి పగిలిన పాదాల

పడిన రక్తపు మరకలు

నేటికి రోడ్లపై చెరిగిపోలేదు.

ఇది నిజం

ఇదే మన భారతం.

ఇదే నేటి భారతం.

ఇదే మన మేటి భారతం…


 

బంగారు వి బి ఆచార్యులు

98495 79569

 

----------------------------------------------------

 

టు,

ది ఎడిటర్

ప్రజాపాలన

 

ఆర్యా!

 

మీకు పంపిన ఈ "వలస బతుకులు" కవిత నా స్వీయ రచన. దేనికి అనువాదంగాని, అనుకరణ గాని కాదు. ప్రచురణార్హమైన ప్రచురించగలరు.

 

బంగారు వి బి ఆచార్యులు

1 - 113 / 17, అరవిందనగర్,

నాగారం, హైదరాబాద్ 500 083

 

Mob: 98495 79569