జిల్లాలో టిఆర్ఎస్ ని నాశనం చేస్తున్న ఎమ్మెల్సీ మధుఉద్యమకారులను చిన్నచూపు చూస్తున్న మధుఎర్

Published: Monday December 05, 2022

మధిర డిసెంబర్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుగా ఉన్న తాతా మధు ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకొని ఉద్యమకారులను మాదిగ సామాజిక వర్గాన్ని చిన్న చూపు చూస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి విమర్శించారు. ఆదివారం టిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర సరిహద్దును మధిర ప్రాంతంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం జరిగిందన్నారు. పదవుల లేకున్నా పార్టీని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా తాము పని చేయటం జరిగిందన్నారు. జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ తాత మధు నాయకుల మధ్య ఉన్న విభేదాలను సమన్వయం చేయకుండా కులాల మధ్య మరింత ఆగదాన్ని సృష్టిస్తున్నారన్నారని, ఆయన ఆరోపించారు. మధిర నియోజకవర్గంలో ఎక్కువ సామాజిక వర్గం మాదిగలకు సముచిత స్థానం లభించడం లేదన్నారు. మధిర నియోజకవర్గానికి  ఇన్చార్జిగా పనిచేసిన తనను ఎర్రుపాలెంలో జరిగిన ఆత్మీయ సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని బొమ్మెర ప్రశ్నించారు. జిల్లాలో టిఆర్ఎస్ కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న మాజీ ఎంపీ పొంగులేటి వెంట పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటమే మాదిగలు చేసిన అన్యాయమా? అంటూ ప్రశ్నించారు. జిల్లాలో ఉద్యమకారులుగా ఉన్న టిఆర్ఎస్ సీనియర్ నాయకులను ఇబ్బంది పెట్టి పార్టీ నుండి బయటికి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో ఏర్పడిన గ్రూపు రాజకీయాలతో ఇతర పార్టీలకు మేలు జరుగుతుందన్నారు. పార్టీ కోసం పని చేస్తున్న నాయకులను పార్టీ సమావేశాలకు పిలవడం లేదన్నారు. ఈ సమావేశంలో బొబ్బిళ్ళపాటి బాబురావు గొల్లమందల మోహన్ చైతన్య తదితరులు పాల్గొన్నారు