పులుసుమామిడిలో 6, 8 వార్డులలో నీటి సమస్యను పరిష్కరించాలి

Published: Wednesday December 28, 2022
* వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 27 డిసెంబర్ ప్రజాపాలన : పులుసుమామిడి గ్రామంలో 6వ, 8వ వార్డులలో నీటి సమస్యను పరిష్కరించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని పులుసు మామిడి గ్రామంలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారెగూడెం కమాల్ రెడ్డి అధ్యక్షతన వికారాబాద్ ఎంపీపీ కామిడీ చంద్రకళ, పంచాయతీ కార్యదర్శి రాములు తో కలిసి వీధి వీధి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేసి, వాటికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. వంగివున్న స్థంబాలను సరి చేయాలన్నారు. గ్రామంలో పంట పొలాలలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలన్నారు. మంజూరు అయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతిలో చేయలేనటువంటి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. గ్రామంలో 6వ, 8వ వార్డులలో నీటి సమస్యను పరిష్కరించేందుకు గేట్ వాల్వ్ ఫిట్ చేయాలన్నారు. మిషన్ భగీరథ నీటిని సక్రమంగా సరఫరా చేయాలని స్పష్టం చేశారు. మిషన్ భగీరథ పైపులు లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేపట్టాలని చెప్పారు. నూతనంగా ఏర్పాటైన కాలనీలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలని తెలిపారు. ప్రజలు చెర్రలు తీయరాదని, ప్రజలు నల్లాలకు ట్యాప్ లు వాడాలని సూచించారు. గ్రామంలో పాడుబడ్డ ఇళ్లను పిచ్చిమొక్కలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలో పశువుల చికిత్స స్టాండ్ ఏర్పాటు చేసి, ప్రతి బుధవారం 9 గంటలకు గ్రామపంచాయతీ ఆవరణలో అందుబాటులో ఉండాలని, పశు వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో నూతనంగా వేసినటువంటి సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి మైన మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ గయాజ్ మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ కైల ఉపేందర్ రెడ్డి ఎంపీడీవో మల్గ సత్తయ్య ఎంపీ ఓ నాగరాజు పంచాయత్ రాజ్ చాణక్య రెడ్డి పిఎసిఎస్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి ఏపీవో శ్రీనివాస్ ఈసీ నవీన్ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.