పొలాల అమావాస్య ను రాష్ట్ర పండగ గా గుర్తించాలి

Published: Monday August 22, 2022
మంచిర్యాల టౌన్, ఆగష్టు 21, ప్రజాపాలన : పొలాల అమావాస్య ను రాష్ట్ర పండగ గా  గుర్తించాలని ఆదివారం రోజున పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు  బోర్లకుంట  వెంకటేష్ నేత ను వారి నివాసంలో మర్యాదపూ ర్వకం గా తెలంగాణ నేతకాని మహార్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ నేత కలిసి పార్లమెంట్ పరిధిలోని పలు సమస్యలను ప్రస్తావిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నేతాకాని జాతి ప్రజలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే  పొలాల అమావాస్యను రాష్ట్ర ప్రభుత్వ పండుగ గా గుర్తించి సెలవు దినంగా ప్రకటించేలా చొరవచూపలని కోరారు. ఈ సదర్భంగా వెంకటేష్ నేత  మాట్లాడుతూ పండగను జరుపుకునే ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు, త్వరలోనే ఈ పండగను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలా చొరవచూపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు ప్రొఫెసర్ జాడి ముసలయ్య , సలహాదారులు కమిటీ సభ్యులు ముడిమడుగుల శంకర్, విద్యార్థి నాయకులు కమెరా రామకృష్ణ , దుర్గం వినోద్ కుమార్, రాజేష్ , కార్తీక్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.