కెసిఆర్ అభివృద్ధి చూడలకే బిజెపి కుట్రలు పన్నుతుంది టిఆర్ఎస్ గెలుపును ఎవరు ఆపలేరు

Published: Saturday October 29, 2022
చౌటుప్పల్, అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి):
ఆరేగుడం, కాట్రేవు, రెడ్డిబావి గ్రామాల్లో రోడ్డు షో ద్వారా ప్రచార నిర్వహించిన మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్,అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ
అరెగుడం గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నాను,ఇక్కడ పొల్యూషన్ ఉంది దగ్గర్లో ఉండే దివిస్ కంపెనీని అడిగాం ఈ గ్రామాన్ని అన్ని అభివృద్ధి చేయాలని ఈ ఊరుకి ఇచ్చిన హామీలు అని తీరుస్తాను చెప్పారు రాజగోపాల్ గురించి ఆలోచించడం 
దండగ, కారు గుర్తుకు ఓటు వేయండి అన్నారు, అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఓటు వేసే ముందు ఆలోచించండి,అభివృద్ధి కోసం అలోచించి ఓటు వేయాలి,ఒకసారి ఓటు వేసి రాజగోపాల్ ని గెలిపించారు మూడున్నర సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉండి ఏమి చేయలేదు
ముగ్గురు ఎమ్మెల్యే లు వున్నా పార్టీ లోకి పోయే ఏమి అభివృద్ధి చేస్తాడు
 టీఆరెఎస్ పార్టీ పథకాలు దేశములో అమలు అవుతే దేశం అభివృద్ధి చెడుతుంది...
  బిజెపి నాయకులు దుబ్బాక,హుజురాబాద్ లో వేల కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు అభివృద్ధి చేయలేదు మునుగోడు అంటే గతంలో ఫ్లోరైడ్ సమస్యలు ఉండేవి ఇప్పుడు అభివృద్ధితో ముందు పోతుంది కేసీఆర్ పంపిన వ్వక్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తు మీద ఓటు వేసి గెలిపిచండి అన్నారు,
 అనంతరం మునుగోడు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 2014లో టిఆర్ఎస్ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చారు
మీరందరూ ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు ఈ ప్రాంత వ్యక్తిగా ఈ సమస్యలు తెలిసిన వ్యక్తిగా అన్ని ప్రాంతాలు తిరిగి సమస్యలు తీసుకొని కేసీఆర్ దగ్గరికి వెళ్లి సమస్యలు వివరించి సమస్యలు పరిష్కరించాను అరేగూడెం గ్రామంలో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చాము ఆడబిడ్డల రుణం తీర్చుకున్నాను 2009లో నుండి ఎంపీగా ఉండే,2018లో ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఈ ప్రాంతంలో కనీసం ఒక శిలా బతకవేయలేదు,ఒక అభివృద్ధి పని చేయలేదు వాళ్ళ అన్న వెంకటరెడ్డి మంత్రి పదవిలో ఉండే ఏమి అభివృద్ధి చేయలేదు 
 రాజగోపాల్ రెడ్డి గెలిచిన తర్వాత ఒక కొబ్బరికాయ కొడితే 100 పనులు అని చెప్పాడు ఇంతవరకు ఒక్క పని చేయలేదు అభివృద్ధి కోసం రాజీనామా చేసాను అంటున్నావు నీవు రాజీనామా ఎందుకు చేసావో ప్రజలందరికి తెలుసు ఎమ్మెల్యే పదవిని అమ్మకనికి పెట్టావు నీ అభివృద్ధి కోసం మాత్రమే రాజీనామా చేశావు ప్రజల కోసం కాదు నువ్వు అభివృద్ధి కోసం రాజీనామా చేస్తే టిఆర్ఎస్ పార్టీలో చేరితే నిజంగానే అభివృద్ధి కోసం అని అనుకునేవారు ప్రజలు బిజెపి పార్టీ ప్రతిపక్షమే కదా ఇప్పుడు బిజెపి పార్టీలో చేరితే నీకు నిధులు ఎలా వస్తాయి ఎలా అభివృద్ధి చేస్తావు అన్నారు నేను ఓడిన కానీ మీ మధ్యనే ఉన్నాను మీకు సేవ చేశాను మీ కుటుంబ సభ్యుడిగా ఉన్నాను సంక్షేమ పథకాలు అందరికి అందజేసి మీ రుణం తీర్చుకున్నాను దళితులకు గిరిజనులకు మైనార్టీలకు వ్యతిరేకమైన పార్టీ బిజెపి పార్టీ
 తన ఓటు తను వేసుకునివాడు మిమ్మల్ని ఓటు అడుగుతున్నాడు ఈ ప్రాంతం వాడు కాదు ఈ ప్రాంత వాడైతే అభివృద్ధి చేసేవాడు ఈ ప్రాంత వాసిగా మీ అన్నగా, మీ తమ్ముడిగా ఈ గడ్డమీద పుట్టిన బిడ్డగా మరొక్కసారి వేడుకుంటున్నాను,ఒక్కసారి దీవించండి ఇక్కడ అభివృద్ధి పనులను చేస్తానని మీకు మాటిస్తున్నాను. అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు సర్పంచులు వార్డ్ నెంబర్లు కార్యకర్తలు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.,