సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ ** సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ జిల్లా క

Published: Saturday January 28, 2023
ఆసిఫాబాద్ జిల్లా జనవరి 27(ప్రజాపాలన,ప్రతినిధి) :
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో సీపీఐ ఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ ఆధ్వర్యంలో 2023 నూతన క్యాలెండర్ ను జిల్లా కార్యదర్శి గోగార్ల తిరుపతి కార్మికులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ సీపీఐ ఎంఎల్ రెడ్ స్టార్ పార్టీ దేశ వ్యాప్తంగా 16 రాష్ట్రాలలో నిర్మాణం కలిగి, అనేక ప్రజా సంఘా లు, విద్యార్ధి, యువజన, మహిళ, కార్మిక, కర్షక, దళిత,గిరిజన, ఇతర పేద ప్రజల సుఖ దుఃఖాల లో పాలు పంచు ఉంటుందని అన్నారు. అలాగే ప్రజా సమస్యల పట్ల సభాలు, సమావేశాలు, మహా సభలు, రాజకీయ, సామాజిక విజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహిస్తు, శ్రమ జీవుల కోసం నిజాయితీ తొ,నిశ్వర్థం తో, పార్టీ రాజకీయాలను ముందుకు తీసుకు వెళ్తుందన్నారు. ఈ  క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అనిల్, ఏ బి ఎం జిల్లా అధ్యక్షులు రాజేష్, కార్మికులు, అజయ్, రాజు, పోషక్, అముల్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.