రాష్ట్రంలోని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినప

Published: Monday September 26, 2022
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని వాసవి నగర్ గిరిజన భవన్ నందు పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ  విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు  మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్  చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు., గడపగడపకు ప్రభుత్వ పథకాలను చేర్చడమే టీఆర్ఎస్ లక్ష్యం అని  ఆయనఅన్నారు. ప్రతి ఒక్కరు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు విమర్శలకు తావు లేకుండా కార్యచరణ ఉండాలని వారు సూచించారు, సంక్షేమ పథకాల అమలులో దేశంలోని రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామిగా ఉంన్నదన్నారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం , ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ గారు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు, వరద మంపు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి 
 కుటుంబానికి పదివేల రూపాయలు బ్యాంకు ఖాతాలో వేయడం జరిగింది అన్నారు,కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడపడుచుల వివాహానికి లక్ష 116 రూపాయలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారి దే అన్నారు, వీటితోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు, అభివృద్ధి సంక్షేమ పథకాలతో టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు కొండంతండగా నిలుస్తుంది అన్నారు,దళిత బంధు పథకం లో దళితుల కుటుంబాలలో ఆనందాన్ని నింపిన నాయకుడు నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని అన్నారు, గత ప్రభుత్వాల పాలనలో కష్టాలు పడ్డ దళిత కుటుంబాలలో ఇంత కాలానికి చిరునవ్వులు చూస్తున్నాయని అన్నారు, దీనికి కారణమైన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి యావత్ దళిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు, ఈ పథకం ప్రవేశపెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత కుటుంబాలకు దేవుడిగా మారారని తెలిపారు, అదేవిధంగా దేశంలో ఎక్కడా లేనటువంటి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారుజిల్లాలో అడవి సంపదను సంరక్షించుకోవడంతోపాటు అర్హులకు పట్టాలు హక్కు కల్పించేందుకు అటవీ పోలీస్ రెవిన్యూ శాఖల సమన్వయంతో ప్రభుత్వం మార్గదర్శకాలు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది అని అన్నారు, సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం 140 జీవోను విడుదల చేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం లోని మార్కెట్ కమిటీ చైర్మన్ లు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లు, అన్ని మండలాల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఆత్మ కమిటీ చైర్మన్ లు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు, సొసైటీ చైర్మన్ లు, సొసైటీ వైస్ చైర్మన్ లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు, సొసైటీ డైరెక్టర్ లు, ఆత్మ కమిటీ డైరెక్టర్ లు, మండల కోఆప్షన్ సభ్యులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, వార్డ్ నెంబర్ లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సోషల్ మీడియా సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తదితరులు పాల్గొన్నారు.