మడుపల్లి మెయిన్ రోడ్డు డ్రైనేజీ క్లీన్

Published: Friday February 26, 2021

మధిర ఫిబ్రవరి 25 ప్రజాపాలన ప్రతినిధి: మధిర మున్సిపాలిటీ పరిధిలో మడుపల్లి గ్రామం మెయిన్ రోడ్ హైస్కూల్ దగ్గర డ్రైనేజీని, డ్రైనేజీ వెంట ఉన్న ముండ్ల కంచె, వయ్యారి భామ చెట్లు తొలగించే కార్యక్రమం 6, 7 వార్డు కాన్సిలర్స్ తొగరు వరలక్ష్మి ఓంకార్, మేడికొండ కళ్యాణి కిరణ్ గార్ల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు తొగరు ఓంకార్, నండ్రు బాబు, మేడికొండ కిరణ్, పీట్ల పుల్లా రావు మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.