వేసవిలోనే బదిలీలు, పదోన్నతులు చేపట్టటానికి తగిన చర్యలు తీసుకోవాలి -అనుమోలు.కోటేశ్వరరావు., ట

Published: Friday April 14, 2023
మధిర ఏప్రిల్ 13 ప్రజా పాలన ప్రతినిధి:టీఎస్ యుటిఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మీనవోలులో జరిగిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి షాబిరాబేగం టీఎస్ యుటిఎఫ్ జెండాను ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఎగురవేశారు. తర్వాత జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.... బదిలీలపై హైకోర్టులో నడుస్తున్న కేసు జూన్ 13 కు వాయిదా పడటం విచారకరం. కేసు వాయిదాను (ఈ నెలాఖరులోగా) ముందుకు జరిపే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రయత్నం చేయాలని తద్వారా వేసవిసెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు జరిగేటందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఒకవేళ అది సాధ్యం కాని పక్షంలో తాత్కాలిక ప్రాతిపదికన పదోన్నతులు అయినా కల్పించాలని కోరుతున్నాము. ఎనిమిదేళ్ళుగా పదోన్నతులు లేక అర్హులైన ఉపాధ్యాయులు నష్టపోతున్నారు. పాఠశాలల్లో ఖాళీల వలన విద్యార్థులకు నష్టం జరుగుతున్నది. పదోన్నతులు ఇస్తేనే నియామకాలకు ఖాళీలపై స్పష్టత వస్తుంది. కనుక వేసవి సెలవుల్లో బదిలీలు, పదోన్నతులు పూర్తి చేసి ప్రత్యక్ష నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుచున్నాము.