సూపర్ స్పైడర్స్ కు కరోనా టీకాలు ఏర్పాట్లు సిద్ధం

Published: Friday May 28, 2021
మేడిపల్లి, మే27 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ ప్రభుత్వ పాఠశాలలో సూపర్ స్పైడర్స్కు కరోనా టీకాలు వేయించడానికి స్థానిక కార్పొరేటర్ మందుముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి ఏర్పాట్లను సిద్ధం చేశారు. శుక్రవారం(నేడు) నుంచి ఇదే సెంటర్లో సూపర్ స్పైడర్స్ కు కరోనా టీకాలు వేయనున్నారు. ఉప్పల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఏర్పాట్లను మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, సెంటర్ ఇంఛార్జ్, మేడిపల్లి తహసీల్దారు ఎస్తేరు అనిత, వైద్యాధికారి డాక్టర్ సౌందర్యలత, సీహెచ్ఓ ప్రకాష్, కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డితో కలిసి గురువారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి రామకృష్ణ, సల్ల ప్రభాకర్ రెడ్డి, వెంకటేష్ గుప్త, రాఘవేందర్ గుప్త, హనుమంతు, ఆలుగుల అనీల్ కుమార్, అల్వాల్ భాస్కర్, జనగాం రామక్రిష్ణ, మంద సుమన్ రెడ్డి, పాలడుగు లక్ష్మణ్, ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి, జీతు రెడ్డి, కన్నమైనా నరేష్ తదితరులు పాల్గొన్నారు.