ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి

Published: Thursday October 29, 2020
వలిగొండ ప్రజా పాలన మాస్క్ రక్షణ కవచం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు దరించాలని కరోనా రాకుండా మాస్క్ రక్షణ కవచంగా పనిచేస్తుందని వేములకొండ వైద్యాధికారి డాక్టర్ సుమన్ కళ్యాణ్,ఆరోగ్య పర్యవేక్షకుడు నాశబోయిన నరసింహ అన్నారు.బుధవారం వెల్వర్తి ఆరోగ్య ఉపకేంద్రంలో గ్రామ ఆరోగ్య పోషకాహార దినోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని తల్లులకు కరోనా నివారణపై అవగాహన నిర్వహించారు.కరోనారాకుండా ప్రతి ఒక్కరూ ఆరడుగుల భౌతికదూరం పాటించాలని తరచుగా చేతులు సబ్బునీటితో కానీ శానిటైజర్ తో కానీ శుభ్రం చేసుకోవాలని మాస్కు ధరించాలన్నారు.మాస్కు పెట్టు కరోనా పనిపట్టు అనే నినాదంతో అన్ని గ్రామాలలో మాస్కేరక్షణకవచం అనే కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.ఈ సందర్భంగా మహిళలకు ఉచితంగా మాస్క్ లను  పంపిణీచేశారు.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్  పసల అన్నా మేరీ,ఆశా కార్యకర్తలు లక్ష్మీ,నమ్రత,లక్ష్మీనరసింహ,గ్రామస్తులు పాల్గొన్నారు.