మాజీ సర్పంచ్ కోటపాటి బాలకృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన మండల కాంగ్రెస్ నాయకులు

Published: Monday January 10, 2022
ఎర్రుపాలెం డిసెంబర్ 9 ప్రజాపాలన ప్రతినిధి: మండలంలోని కొత్తపాలెం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ కీర్తిశేషులు కోటపాటి బాలకృష్ణ రావు(బాలా), గుండెపోటుతొ మృతి చెందటం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన పార్థివదేహానికి కాంగ్రెస్ కండువాతో పూలమాల వేసి నివాళులర్పించిన మండల కాంగ్రెస్ కమిటీ. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బండారు నరసింహారావు, నాయకులు కంచర్ల వెంకటనరసయ్య, షేక్ ఇస్మాయిల్, రావూరి నాగబాబు, లింగాల నాగేశ్వరరావు, దేవరకొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.