పల్లె ప్రగతి అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి

Published: Wednesday June 15, 2022
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **
 
ఆసిఫాబాద్ జిల్లా జూన్ 14 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలో 5 వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం లో "జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్" పాయి తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులతో పరీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈనెల 18వ తేదీన గ్రామసభ నిర్వహించి పెండింగ్లో ఉన్న పనుల వివరాలతో నివేదిక తయారు చేసి అందించారని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాల్లో ఎక్కడ కూడా చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు ఇంటింటికీ తిరుగుతూ  తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని తెలిపారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలలో చనిపోయిన మొక్కలు స్థానములో కొత్తవి పెద్ద మొక్కలు నాటి  రక్షించాలని, ప్రతి ఎకరానికి 4 వేల మొక్కలు ఉండేవిధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. జిల్లాలో ఆయా మండలాలకు కేటాయించిన ఈ విధంగా క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేయడంతో పాటు అవసరమైన క్రీడా సామాగ్రిని అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.