కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిప్ట్ ఏ స్మైల్ క్రింద ఉచిత కంటి శస్త్ర చికిత్సలు

Published: Monday July 25, 2022

జగిత్యాల, జూలై 24 (ప్రజాపాలన ప్రతినిధి): ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని గిప్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పావని కంటి ఆసుపత్రిలో 37 ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. అనంతరం జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్, మున్సిపల్ ఛైర్మెన్ భోగ శ్రావణిప్రవీణ్ పేసేంట్లకు కంటి అద్దాలు, మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి, ఏయంసి వైస్ చైర్మన్ అసిఫ్, జిల్లా కౌన్సిలర్ల పోరం అద్యక్షులు పంబాల రాము, ప్రధాన కార్యదర్శి తోట మల్లికార్జున్, ఎప్.సి.యస్ అధ్యక్షులు గుమ్ముల అంజయ్య, జిల్లా ఎంపీటీసీల పొరం నాగరాజు, రాయికల్ యూత్ అధ్యక్షుడు నాగరాజు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, నాయకలు, తదితరులు పాల్గొన్నారు.