ఎర్రోల్ల శ్రీనివాస్ కు శుభాకాంక్షలు

Published: Friday February 25, 2022
జిల్లా తెరాస అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్ బ్యూరో 24 ఫిబ్రవరి ప్రజాపాలన : మెడికల్ సర్వీసెస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఎర్రోల్ల శ్రీనివాస్ కు శుభాకాంక్షలు అని వికారాబాద్ జిల్లా తెరాస అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ మెడికల్ సర్వీసెస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన ఎస్సీ & ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేశారు.