పాఠశాల తరగతి గది ప్రారంభోత్సవం......

Published: Thursday January 20, 2022
ఎర్రుపాలెం జనవరి 19 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని తెల్ల పాలెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గది నీ బుధవారం మండల పరిషత్ అధ్యక్షులు దేవరకొండ శిరీష ప్రారంభించారు. వైయస్సార్ ఫౌండేషన్ మరియు గ్రామస్తుల సహకారం, శీలం హరేందర్ రెడ్డి సహకారంతో తెల్లపాలెం పాఠశాల అదనపు తరగతి గది మరియు ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టినట్లు మండల పరిషత్ అధ్యక్షులు దేవరకొండ శిరీష తెలిపారు. పాఠశాలలో సుమారు 12 లక్షల ఖర్చుతో అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె తెలిపారు పాఠశాల తరగతి గది ని శ్రీలం నరేంద్ర రెడ్డి, వరండాను శిరీష, ప్రధానోపాధ్యాయులు గదిని జడ్పిటిసి శీలం కవిత ప్రారంభించారు. తెల్ల పాలెం గ్రామం లోని పూర్వ విద్యార్థులు ఆర్థిక సహకారంతో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడం పట్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి వాసిరెడ్డి అశోక్ దాతల ను అభినందించారు. మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ మండలంలో పాఠశాల విద్యా ప్రగతి లో మండలంలో ముందుంది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెరుగు రామకృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కంచర్ల శ్రీనివాస్ రావు, ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, శిరీష, ఎస్ఎంసి చైర్పర్సన్ రామకృష్ణ, ఎస్ఎంసి వైస్ చైర్మన్ వేమిరెడ్డి శిరీష, గ్రామస్తులు ఆవుల ముత్తయ్య, దాతలు సీతారామరాజు, లక్ష్మారెడ్డి, వేమి రెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.