జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిదే విజయం

Published: Wednesday March 03, 2021
మధిర, మార్చి 2 ప్రజాపాలన ప్రతినిధి: ఎర్రుపాలెం మండలం సకినవీడు, ములుగు మాడు ఇనగాలి గ్రామాలలో మార్చి 14న జరగనున్న నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఆ గ్రామాల పట్టభద్రులను కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఓట్లను అభ్యర్థిస్తున్నా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూరాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆశీస్సులతో నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా గా పల్లా రాజేశ్వర్ రెడ్డి గారినిమొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలనిఈ నష్టం లో ఓటు అడిగే హక్కు కేవలం టిఆర్ఎస్ పార్టీ తప్ప మరొక పార్టీకి లేదని స్వాతంత్రం వచ్చిన నాటి నుండి అనేక పార్టీలు పరిపాలించి రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలంగాణ సాధించుకున్న ఆరేళ్లలో దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రశేఖరరావు గారిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పిటిసి శీలం కవిత, డిసిసిబి డైరెక్టర్ ఐలూరు వెంకటేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చావ రామకృష్ణ, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షులు మొగిలి అప్పారావు, రైతు బంధు సమితి మండల కన్వీనర్ శీలం వెంకట్రామిరెడ్డి, గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు పట్టబద్రులు టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు హాజరైనారు