పాఠశాల విద్యార్థులకు బాలల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసిన సర్పంచ్ వివిధ వేషధారణలో ఆకట్ట

Published: Tuesday November 15, 2022

బోనకల్ నవంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు  కేవియం జడ్పీ పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా సర్పంచ్ మర్రి తిరుపతిరావు విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు  రమేష్ అధ్యక్షతన సోమవారం బాలల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  సర్పంచ్ తిరుపతిరావు మాట్లాడుతూ బాలల దినోత్సవం 2022 నేడు నాడు 1964 సంవత్సరం నుండి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నారు. బాలల దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 14 స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ నేహ్రు జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవంగా జరుపుకుంటారు.  నెహురుకు పిల్లలంటే చాలా ఇష్టం అని ఖాళీ సమయం దొరికినప్పుడల్లా వారితో గడిపేవారని, పిల్లలు కూడా ఆయనను ముద్దుగా చాచా నెహ్రూ అని పిలిచేవారని అన్నారు. కాబట్టి 1964 సంవత్సరం నుండి  జవహర్లాల్ నేహ్రు పుట్టినరోజును బాలల దినోత్సవం జరుపుకుంటున్నారని తెలియజేశారు. బాలల దినోత్సవం వెనుక ఉన్న వాస్తవం పిల్లల అవసరాలను గుర్తించడం వారి హక్కులను రక్షించడం, దోపిడీని అరికట్టడం పిల్లలు సరియైన ఎదుగుదల కోసం కృషి చేయడమని, అయితే  1964లో  నేహ్రు మరణాంతరం భారత పార్లమెంట్లో ఒక తీర్మానం ఆమోదించబడి నవంబర్ 14న బాలల దినోత్సవం గా గుర్తించబడిందని పిల్లలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ కి  పూలాభిషేకం చేసి పిల్లలతో క్రీడా కార్యక్రమాలను నిర్వహించారు. తదనంతరం అళ్లపాడు అంగన్వాడి కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల చేత చాచా నెహ్రూ అంగనవాడి, ఆయా, అంగన్వాడి టీచర్ నెహ్రూ పోలీసు వేషధారణ  పిల్లలచే ఆకర్షణ నింపచేసారు. అనంతరం పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించిచారు. ఈ కార్యక్రమంలో  సర్పంచ్ మర్రి తిరుపతిరావు, ప్రాదానోపాద్యలు రమేష్, పాఠశాల ఉపాద్యాయులు, పి ఈ టి మాధవరావు , అంగన్వాడీ టించర్లు  పద్మ,  హుస్సేన్ బీ, గ్రామ పేద్దలు పాల్గొన్నారు.