ఉచిత గుండె వైద్య శిబిరానికి విశేష స్పందన

Published: Monday April 10, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 9 (ప్రజాపాలన ప్రతినిధి)
ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్లో కార్పొరేటర్ సుభాష్ నాయక్ ఆధ్వర్యంలో ప్రతిమ హాస్పిటల్ సౌజన్యతో"ఉచిత గుండె వైద్య శిబిరం" నిర్వహించారు.ఈ సందర్భంగా సుభాష్ నాయక్ మాట్లాడుతూ వయస్సుతో సంబందం లేకుండ ఈ మధ్యకాలంలో గుండెపోటుతో ప్రజలు మరణిస్తున్నారని,ఈ నేపథ్యంలో డివిజన్ ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట ప్రతిమ హాస్పిటల్  సహకారంతో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించామని, ఈ శిబిరంలో సుమారు 250 మందికి బిపి, జి.ఆర్.బి.ఎస్, 2D- ఎకో, ఈసీజీ మొదలైన పరీక్షలను ఉచితంగా నిర్వహించామని, 9 మందికి గుండె సమస్యలను గుర్తించి మెరుగైన వైద్యం కోసం ప్రతిమ హాస్పిటల్ కు రెఫర్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా వైద్య శిబిరం విజయవంతం చేసిన ప్రజలకు, సేవా దృక్పథంతో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించిన 
ప్రతిమ హాస్పిటల్ యజమానికి కార్పొరేటర్ సుభాష్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 
ఈ కార్యక్రమంలో ఎస్ వి కాలనీ అధ్యక్షుడు రాధాకృష్ణారావు,బి ఆర్ ఎస్ డివిజన్ అధ్యక్షుడు బాలరాజు,డివిజన్ జనరల్ సెక్రటరీ వర్కల శ్రీనివాస్,బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు బండారు మల్లేష్,ధరణి కాలనీ అధ్యక్షుడు పురుషోత్తం,కాకతీయ నగర్ కాలనీ ప్రధాన కార్యదర్శి జహంగీర్,సుదర్శన్ నగర్ కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్,పంచవటి కాలనీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, 2వ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షుడు శంకరాచారి,నేహా అపార్ట్మెంట్స్ అధ్యక్షుడు మల్లేష్,సీనియర్ సిటిజన్స్ మాజీ అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు,డివిజన్ లోని పలు కాలనీల నాయకులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.