సింగరేణి ప్రైవేటికరణకు వ్యతిరేకంగా పోరాడుదాం.

Published: Wednesday April 20, 2022
సింగరేణి పరిరక్షణకై - సీఐటీయూ పిలుపు
మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 19, ప్రజాపాలన : సింగరేణి పరిరక్షణ కై సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్, కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం రోజున శ్రీరాంపూర్ జిఎం ఆఫీస్ ముందు నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ దీక్షకు ముఖ్య అతిథులుగా హాజరై దీక్షలో కూర్చున్న వారికి ముందుగా పూల దండాలు వేసి దీక్షను ప్రారంభించిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని సింగరేణిని సంస్థను నిర్వీర్యం చేసే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వ్యవహరిస్తున్నాయని, దేశంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటికరణ చేసే దిశగా దుర్మార్గమైన ఆలోచనలో ఉందని దేశ సంపాదనను ఆధాని, అంబానీ లకు దోచి పెట్టె విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహారిస్తుందని. రాబోయే రోజుల్లో సింగరేణి పరిరక్షణ కొరకు కార్మికులందరూ ఐక్యంగా ముందుండి పోరాటం చేయాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షులు మీడివెల్లి శంకర్, కార్యదర్శి భాగ్యరాజు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి జిల్లా అధ్యక్షురాలు వేల్పుల కుమారి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోమాస ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి బాలాజీ, సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, గంగాధర్ చారి, చంద్రయ్య, శ్రీనివాస్, చంద్ర శేఖర్, మీడివెల్లి రాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు.