మా కాలనీలో బెల్ట్ షాపులు వద్దు

Published: Thursday April 22, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి : రాత్రి సమయంలో ఆకతాయిలు తో మహిళలకు ఇబ్బందిబెల్ట్ షాప్ నిర్వాహకులను నిలదీసిన సిరిపురం ఎస్సీ కాలనీ వాసులుమండల పరిధిలోని సిరిపురం గ్రామం SC కాలనీలో బెల్టుషాపులు విక్రయం వలన చదువుకునే విద్యార్థులు జీవితాలు నాశనం చేసుకుంటున్నారని మంచిగా ఉన్నవారు కూడా చెడిపోతున్నారని రాత్రి సమయాల్లో వేళాపాళా లేకుండా బండ్లు వేసుకుని ఆకతాయిలు తిరుగుతున్నారని దీంతో భయం భయంగా నిద్రించాలి వస్తుందని ఎస్సీ కాలనీ చెందిన మహిళలు వాపోతున్నారు. ఇప్పటివరకు బెల్టు షాపు వద్దకు వెళ్లి తాగి వచ్చే వారు సైతం రాత్రివేళల్లో ఆకతాయి గా తిరుగుతున్నారని మహిళలు పేర్కొంటున్నారు. అదేమని బెల్ట్ షాప్ నిర్వాహకులను మహిళలు ప్రశ్నిస్తే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను బెల్ట్ షాప్ అమ్మేదే అంటూ ప్రశ్నిస్తుంది. కావున దయచేసి సంబంధిత శాఖ అధికారులు ఈ బెల్ట్ షాప్ నిర్వహణపై దృష్టి సాధించి తగు చర్యలు తీసుకోవాలని కాలనీ మహిళలు పేర్కొన్నారు.