రంజాన్ పండుగ సందర్భంగా గిఫ్టులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే - సంజాయ్ కుమార్

Published: Friday May 07, 2021
జగిత్యాల, మే 06 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇస్లాంపురా పురానిపెట్ తదితర మజిధులలో రంజాన్ పండుగ గిఫ్టులను ముస్లిం సోదరులకు బట్టలు ఖార్జురా తదితర గిఫ్టులను ఎమ్మెల్యే డా.సంజాయ్ కుమార్ అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ముస్లింలను దృష్టిలో పెట్టుకొని రంజాన్ సందర్భంగా సహాయం చేయాలనే మంచి ఆలోచనలో ఈ సంక్షేమ పథకం అమలు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కప్పల శ్రీకాంత్ గట్టు సతీష్ బోగ ప్రవీణ్ అదిల్ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.