ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

Published: Wednesday March 17, 2021
మేడిపల్లి మార్చి16 (ప్రజాపాలన ప్రతినిధి) :పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధి 1వ డివిజన్ అయోధ్య కాలనీలో హ్యాండ్ ఆఫ్ హోప్ వారి ఆధ్వర్యంలో ఐ వి & డిలైట్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.ఈ ఉచిత వైద్య శిబిరానికి మేయర్ జక్క వెంకట్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. వైద్య శిబిరంలో ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, మరియు కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎంపల్ల అనంత్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇర్ఫాన్, నాయకులు ఏనుగు మనోరంజన్ రెడ్డి, జావిద్ ఖాన్, నిర్మల, దంతం రాకేష్, మెతుసెల్లా, పన్నా భాయ్, హ్యాండ్ ఆఫ్ హోప్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.